విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్ పరిశీలించిన కేటీఆర్
రిపోర్టర్: రాము
స్థలం: పెబ్బేరు, వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో నేరుగా స్థానిక సబ్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ రికార్డులు, లాగ్‌బుక్‌లను పరిశీలించారు. రైతులకు మరియు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న విద్యుత్ సరఫరా తీరుపై అధికారులను ఆరా తీశారు. ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.