మహిళలకు తీపి కబురు: వంద కోట్లకు చేరిన ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో వంద కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలను మహిళలు వినియోగించుకున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని అతివలకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు సగటున ఇరవై నాలుగు లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు.