ఏడు భాగాలుగా 'శ్రీమద్భాగవతం' భారీ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాదు

భారతీయ ప్రాచీన పురాణ గాథలను అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించేందుకు సాగర్ పిక్చర్స్ శ్రీకారం చుట్టింది. 'శ్రీమద్భాగవతం' మహాగాథను ఏడు భాగాలుగా భారీ సినిమాటిక్ యూనివర్స్‌గా మలచబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలి భాగంగా 'శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ'ను ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర ముహూర్తపు వేడుకలు జరిగాయి.