టెక్ రంగంలో భారీ పతనం: ప్రపంచ కుబేరుల సంపద హాంఫట్
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
అమెరికా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రపంచ కుబేరుల సంపద భారీగా కరిగిపోయిందని ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది. కృత్రిమ మేధస్సుపై భారీ వ్యయాలు, కార్పొరేట్ సంస్థల నిరాశజనక ఫలితాలతో టెక్ స్టాక్స్ పతనమయ్యాయి. దీనివల్ల ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి అగ్రగామి సంపన్నుల నికర విలువ గణనీయంగా తగ్గిపోయినట్లు విశ్లేషకులు స్పష్టం చేశారు. కేవలం వారంలోనే ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్లు వందల బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు.