తెలంగాణలో పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే సగటున 2.09 మీటర్ల మేర నీటి మట్టం తగ్గింది. 17 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరిలో జలాలు 12.12 మీటర్ల లోతుకు పడిపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.