బెంగళూరులో భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త అరెస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Bengaluru

కర్ణాటకలోని బెంగళూరు నగరంలోని బిళేకహళ్లిలో భార్య గుంజా మద్దేశియాను గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా నమ్మ యత్నించిన భర్త రంజిత్ కుమార్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ కాల్స్ మాట్లాడలేదన్న కోపంతో, కుటుంబ కలహాల కారణంగా నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.