ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యంపై కమిషన్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దురుసుగా వ్యవహరించడంపై ఆ పార్టీ నేతలు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులపై దాడి ఘటనపై స్పందించిన కమిషన్‌ చైర్మన్ బక్కి వెంకటయ్య.. తక్షణ విచారణ జరిపి 48 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించారు.