దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు: భక్తుల భద్రతకు పోలీసుల పకడ్బందీ చర్యలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ప్రసిద్ధ బన్నీ ఉత్సవానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారని, విజయదశమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే ఈ కర్రల సమరం సందర్భంగా విద్యుత్ వెలుతురుతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచామని పోలీసు శాఖ స్పష్టం చేసింది.