రాజంపేట మున్సిపల్ పీఠం కైవసం: ఏకగ్రీవంగా టీడీపీ అభ్యర్థి ఎన్నిక ఖాయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Rajampet

అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానానికి జరిగిన నామినేషన్ల పరిశీలనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీతో పాటు మరో అభ్యర్థి నామినేషన్ పత్రాలు తిరస్కరించబడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో పోటీలో వేరేవారు లేకపోవడంతో తెలుగుదేశం కూటమి అభ్యర్థి డాక్టర్ దొంతం గాయత్రి విజయం ఏకగ్రీవమయ్యే అవకాశాలు స్పష్టమయ్యాయి. పరిశీలన ప్రక్రియ పూర్తికాగానే అధికారిక ప్రకటన వెలువడనుందని అధికారులు వెల్లడించారు.