ఐక్యరాజ్యసమితి పనితీరును ఎద్దేవా చేస్తూ ఇరాన్ రాయబార కార్యాలయం మీమ్
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
ఐక్యరాజ్యసమితి పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. మార్వెల్ సినిమాలోని డాక్టర్ స్ట్రేంజ్ పాత్రను ఐరాసకు పోల్చగా, షోలే చిత్రంలోని ఠాకూర్ పాత్రను వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నట్లుగా పోల్చారు. ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలను నివారించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమవుతోందంటూ ఈ వినూత్న వ్యంగ్య ప్రచారంతో ఇరాన్ ఎద్దేవా చేసినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి.