పేదల చదువుకు దాతల చేయూత నిలుస్తున్న వైనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చంద్రగిరి

చంద్రగిరి మండలం కొట్టాల ప్రాథమిక పాఠశాలలో ఏకం యూఎస్ఏ ఆర్థిక సహకారంతో, సిర్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. సిర్డ్స్ కార్యదర్శి హేమశేఖర్, ప్రధానోపాధ్యాయులు కోదండపాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల అభ్యున్నతికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.