మంత్రిపాలెంలో ఇంటింటా టీడీపీ ప్రచారం.. సమస్యల పరిష్కారానికి హామీ

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

పెందుర్తి క్లస్టర్ పరిధిలోని మంత్రిపాలెంలో ఉమ్మడి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ 'ఇంటింటా తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ ఇంచార్జ్, మాజీ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది.

ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జెర్రిపోతుల అప్పారావు, బూత్ కన్వీనర్లు కరణం గణేష్, స్థానిక నాయకులు అలమల రాజు, ట్రాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.