ఆసియా క్రీడల్లో ముప్పైకి పైగా పతకాలు సాధిస్తామన్న అంజు బాబీ జార్జ్

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

నీరజ్ చోప్రా లేనప్పటికీ ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ బృందం ముప్పైకి పైగా పతకాలు సాధిస్తుందని మాజీ లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ ధీమా వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌లో జరిగిన పోటీలలో అన్సీ సోజన్ తన జాతీయ రికార్డును బద్దలు కొట్టడం అథ్లెటిక్స్ పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల లాంగ్ జంప్‌లో అన్సీ సోజన్, శైలి సింగ్ లతో పాటు పురుషుల విభాగంలో మురళీ శ్రీశంకర్ నుంచి పతకాలు ఆశించవచ్చని ఆమె స్పష్టం చేశారు.