గుజరాత్‌లోని కేవాడియాలో ఘనంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

రిపోర్టర్: సురేష్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లోని ఏక్తా నగర్ కేవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా 2024 సంవత్సరానికి సంబంధించి భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ఈ పురస్కారాలను అందజేయనున్నారు. దిల్లీ వెలుపల తొలిసారిగా ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఈ వేడుకను నిర్వహిస్తుండటం విశేషం.