గుంటూరులో రైలు గేట్ల సమస్యకు గడ్డిపాడు ఆర్ఓబీతో శాశ్వత పరిష్కారం
రిపోర్టర్: సురేష్
స్థలం: గుంటూరు
గుంటూరు ప్రజలకు మరింత సులభమైన ప్రయాణాన్ని, మెరుగైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా గడ్డిపాడు ప్రాంతంలో ఆర్ఓబీ నిర్మాణ పనులను చేపట్టినట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. రైలు గేట్ల వద్ద నిత్యం ఏర్పడుతున్న తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ వంతెనతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు. దీని ద్వారా స్థానిక ప్రజల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.