తెలంగాణ కీర్తి: ఆస్ట్రేలియా మార్కెట్లోకి తాండూరు కందిపప్పు ఎగుమతి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

మన తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ భౌగోళిక గుర్తింపు పొందిన ప్రసిద్ధ తాండూరు కందిపప్పు తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ అపెడా సహకారంతో ఈ ప్రసిద్ధ కందిపప్పు ఆస్ట్రేలియా దేశానికి విజయవంతంగా ఎగుమతి అయిందని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక పరిణామం ద్వారా స్థానిక రైతులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించడంతో పాటు ఎగుమతులు మరింత ఊపందుకుంటాయని స్పష్టం చేశారు.