పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్పాస్ పునరుద్ధరణ: మారబోయిన రవి యాదవ్ చొరవ

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్పాస్లో వర్షపు నీరు, చెత్త పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు మారబోయిన రవి యాదవ్ తన సొంత ఖర్చులతో నీటిని తొలగించి, శుభ్రం చేయించి ప్రజలకు మార్గాన్ని పునరుద్ధరించారు. గత మూడేళ్లలో పన్నెండు సార్లు ఇలాగే క్లీన్ చేయించినట్లు ఆయన తెలిపారు. శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు.