రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Tirupati
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టాప్ అండ్ వాష్ పేరుతో డ్రైవర్లను అప్రమత్తం చేస్తోంది. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయవద్దని, అలసటగా ఉంటే వాహనం నడపరాదని సూచించింది. వేగం కంటే ప్రాణమే ముఖ్యమని హెచ్చరిస్తూ రోడ్డు భద్రతా చర్యలు చేపట్టింది.