భారత్ తో వాణిజ్య నిలిపివేత: పాకిస్థాన్ కు భారీగా నష్టమన్న నూర్ మహమ్మద్ ఖసూరి

రిపోర్టర్: విజయ్ స్థలం: ఇస్లామాబాద్

భారత్ తో వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడం వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు ఐదు సంవత్సరాలలో సుమారు నలభై బిలియన్ డాలర్ల మేర భారీ నష్టం వాటిల్లినట్లు పాక్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ నూర్ మహమ్మద్ ఖసూరి తెలిపారు. పుల్వామా దాడి తర్వాత దెబ్బతిన్న దిగుమతుల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి ఔషధ, వస్త్ర పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయని, తక్షణమే వాణిజ్యం పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు.