చెన్నైలో సంచలనం: నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి హత్య

రిపోర్టర్: రాజేష్ స్థలం: చెన్నై

ప్రముఖ సినీనటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడు ప్రశాంత్ను హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి వెళ్లిన ప్రశాంత్ కనిపించకపోవడంతో బంధువులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేవరాజు, దినేష్లను అదుపులోకి తీసుకుని విచారించారు. స్నేహితులైన వారు ప్రశాంత్ను పొన్నేరి బీచ్కి తీసుకెళ్లి హత్య చేసి ఇసుకలో పాతిపెట్టినట్లు వెల్లడించారు. గురువారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించినట్లు పుదుప్పేట పోలీసులు తెలిపారు.