తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ: బండి సంజయ్ కు మళ్లీ రాష్ట్ర పగ్గాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠంపై రాజకీయ వర్గాల్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు రాజకీయ పరిశీలకులు తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో, ఆ బాధ్యతలను మళ్లీ ఎంపీ బండి సంజయ్ కు అప్పగించే యోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. పార్టీలో దూకుడు పెంచి పూర్వవైభవం తెచ్చేందుకు అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.