పోక్సో కేసులో సంచలన తీర్పు: నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష
రిపోర్టర్: రమేష్
స్థలం: ములుగు
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ములుగు ప్రత్యేక పోక్సో న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. ఏటూరునాగారం పరిధిలో 2020లో నమోదైన ఈ కేసులో వావిలాల రాజు నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. నిందితుడికి ఎనిమిది వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.