బ్రిక్స్ వేదికగా కీలక ఆర్థిక ప్రతిపాదనలు చేసిన భారత్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో సభ్య దేశాల మధ్య వాణిజ్యం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలని భారత్ కీలక ప్రతిపాదనలు చేసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆర్థిక భద్రత, స్వయం సమృద్ధి ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల అనుసంధానం, స్థానిక కరెన్సీలలో వాణిజ్యం పెంచాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆర్థిక షాక్‌లను తట్టుకునేందుకు ఈ వ్యూహాలు దోహదపడతాయని స్పష్టం చేశారు.