అమెరికా సంచలన నిర్ణయం: ఇజ్రాయెల్ కు ఏటా అందిస్తున్న ఆర్థిక సాయం నిలిపివేత
రిపోర్టర్: రాము
స్థలం: Washington
ఇజ్రాయెల్ కు ఏటా అందిస్తున్న నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని వచ్చే ఏడాది నుంచి నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మిత్ర దేశానికి రక్షణ ఉత్పత్తులను మాత్రం విక్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకు ఆర్థిక భారం పెరుగుతున్నందునే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్ లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో గత రెండేళ్లుగా ఈ అంశంపై చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.