చీమ లాగేలా వినాయక విగ్రహం అద్భుత సృష్టి!

రిపోర్టర్: గోపి స్థలం: కాకినాడ

పెద్దాపురానికి చెందిన గిన్నిస్‌ రికార్డ్‌ గ్రహీత డా. తాళాబత్తుల సాయి కేవలం ఒక సెంటీమీటర్ ఎత్తుగల వినాయక విగ్రహాన్ని, బుల్లి వాహనాన్ని రూపొందించారు. చెక్క, బంగారం, స్టీల్‌ బేరింగులతో దీన్ని తయారు చేశారు. ఎనిమిది రోజుల పాటు శ్రమించి చేసిన ఈ బుల్లి వాహనాన్ని ఓ చీమ లాక్కెళ్తుండగా వీడియో తీసి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అద్భుత కళాఖండం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.