ట్రంప్ మరియు రిపబ్లికన్లపై ఎలిజబెత్ వారెన్ ఘాటు విమర్శలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Washington
అమెరికా సెనేటర్ ఎలిజబెత్ వారెన్ డోనాల్డ్ ట్రంప్ మరియు రిపబ్లికన్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లికన్ సెనేటర్లకు వెన్నుముక తొలగించారంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్ ముందు తలవంచడం మినహా వారికి వేరే పని చేతకాదని ఎలిజబెత్ వారెన్ ఎద్దేవా చేశారు. అమెరికా రాజకీయాల్ లో ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. పరిపాలనలో ట్రంప్ అనుకూల విధానాలను ఆమె నిలదీశారు.