నాగలాపురం ఆలయంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగిన శ్రీవారి అన్నాభిషేక మహోత్సవం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాగలాపురం
నాగలాపురం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ వాల్మీకేశ్వర స్వామివారికి శ్రద్ధాభక్తులతో అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామివారిని అలంకరించిన అన్న ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందారు.