జీవో 97 రద్దు కోరిన పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం

రిపోర్టర్: మహేష్ స్థలం: రంగారెడ్డి

జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను, అమ్మాయిలను సైతం ఈడ్చుకెళ్తూ అరెస్ట్ చేశారు. ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం అంటూ విద్యార్థులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.