దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలు నిర్వహించిన బీజేపీ నేతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మోత్కూర్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పనకబండ గ్రామంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని, సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.