రాష్ట్ర ప్రభుత్వ శాఖలను వరించిన ఏడు స్కోచ్ అవార్డులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: దిల్లీ
ఉత్తమ పనితీరు కనబరిచిన వివిధ ప్రభుత్వ శాఖలకు ఏడు జాతీయ స్థాయి స్కోచ్ అవార్డులు దక్కినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో స్కోచ్ సంస్థ ఛైర్మన్ సమీర్ కొచ్చార్ చేతుల మీదుగా రాష్ట్ర అధికారుల బృందం ఈ పురస్కారాలను అందుకుంది. సోషల్ ఆడిట్ విభాగం, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు పలు శాఖలు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్నాయని అధికారులు స్పష్టం చేశారు.