షాకింగ్ ఘటన: గ్రేట్ వైట్ షార్క్ తో మహిళకు తృటిలో తప్పిన ప్రమాదం
రిపోర్టర్: నరేష్
స్థలం: Tybee Island
అమెరికాలోని జార్జియా తీరంలో షార్క్ చేపను తాకడానికి ప్రయత్నించిన ఒక మహిళపై భారీ గ్రేట్ వైట్ షార్క్ ఒక్కసారిగా విరుచుకుపడినట్లు నాట్ లక్కీ ఫిషింగ్ సంస్థ వ్యవస్థాపకుడు జిమ్మీ లీ ఆర్మెల్ వెల్లడించారు. షార్క్ ట్యాగింగ్ యాత్రలో భాగంగా పడవపై నుంచి ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సిబ్బంది చేపను అదుపులో ఉంచడంతో ప్రాణాపాయం తప్పిందని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.