సింహపురి యూనివర్సిటీలో ట్రైనర్ పోస్టులకు నవంబర్ పదో తేదీన కీలక ఇంటర్వ్యూలు

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో కాంపిటేటివ్ సెల్ ట్రైనర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆప్టిట్యూడ్ మరియు జనరల్ స్టడీస్ ట్రైనర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నవంబర్ పదో తేదీన నేరుగా హాజరుకావాలని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.