నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
రిపోర్టర్: గోపి
స్థలం: Nellore, Andhra Pradesh
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమతి కోటంరెడ్డి సుజిత గారు గోమాతకు పూజలు చేసి, గోసేవ చేశారు. శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన గోమాతను పూజించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.