గురుగ్రామ్లో దారుణం: చెత్త వివాదంతో వాచ్మ్యాన్ కుటుంబంపై కర్రలతో దాడి

రిపోర్టర్: సతీష్ స్థలం: Gurugram

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ జిల్లాలోని బెహ్రంపూర్ గ్రామంలో చెత్త పారబోసే విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర హింసాత్మకంగా మారింది. స్థానిక వాచ్మ్యాన్ కుటుంబసభ్యులపై నిందితులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి చంపుతామని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు సెక్టార్ 65 పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.