మైనారిటీ విద్యార్థులకు తీపి కబురు: రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ జిల్లాలో మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ హైదరాబాద్ వెల్లడించారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయంతో కూడిన చెక్కులను అధికారికంగా పంపిణీ చేశారు. విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే అర్హులైన పేద విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అధికారులు భరోసానిచ్చారు.