గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుపై ప్రత్యేక రీల్స్ పోటీలు
రిపోర్టర్: నరేష్
స్థలం: కడప
రాయలసీమతో పాటు ప్రకాశం ప్రాంతాలను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రీల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు 60 నుండి 90 సెకన్ల నిడివితో వీడియోలు పంపాలని సూచించారు. అత్యుత్తమ సృజనాత్మకత ప్రదర్శించిన ఐదు వీడియోలను ఎంపిక చేసి అక్టోబర్ 1న విజేతలను ప్రకటించి ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.