హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారు బోల్తాపడి దంపతులు దుర్మరణం
రిపోర్టర్: రమేష్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి మండలం కంది గ్రామం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. శంకర్పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన యెల్లకొండ నరసింహులు, మౌనిక దంపతులు ఫోర్డ్ కారులో శంకర్పల్లి నుంచి సంగారెడ్డి వైపు వస్తుండగా డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన భార్యాభర్తలు ఇద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారని, అతివేగమే ప్రమాగానికి కారణమని పోలీసులు వెల్లడించారు.