'యూపీఐపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు': కాంగ్రెస్‌పై బీజేపీ కౌంటర్
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
యూపీఐ చెల్లింపులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ బీజేపీ అధికారికంగా వివరణ ఇచ్చింది. యూపీఐ అనేది ఎలాంటి పన్ను కాదని, ఇది పూర్తిగా సురక్షితమైనది మరియు ఉచితమని స్పష్టం చేసింది. వ్యక్తిగత చెల్లింపులతో పాటు రెండు వేల రూపాయల వరకు జరిగే మర్చంట్ లావాదేవీలు పూర్తిగా ఉచితమని, కేవలం పెద్ద వ్యాపారులకు మాత్రమే నామమాత్రపు ఛార్జీలు వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వదంతులను నమ్మవద్దని కోరుతూ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను బీజేపీ తీవ్రంగా ప్రశ్నించింది.