చేర్యాలలో జరిగే ఎఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పిలుపు
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఈ నెల 24, 25 తేదీలలో జరిగే ఎఐఎస్ఎఫ్ ఐవవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభకు విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.