నిజామాబాద్‌లో నడిరోడ్డుపై హరిబాబు బీభత్స హత్య

రిపోర్టర్: హరి స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో హరిబాబు అనే వ్యక్తిని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. గతంలో గర్భిణి అయిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో అరెస్టయిన హరిబాబు, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కారులో వచ్చిన దుండగుడు అతన్ని నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.