నిరుద్యోగులకు గుడ్ న్యూస్: కోలకతా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kolkata

కోలకతా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు లేడీ కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను వెస్ట్ బెంగాల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. తదుపరి దశ పరీక్షల కోసం అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.