అట్టహాసంగా సైమా అవార్డ్స్-2026 వేడుక.. విజేతలు వీరే!

రిపోర్టర్: రాజేష్ స్థలం: కర్ణాటక

బెంగళూరు వేదికగా సైమా అవార్డ్స్-2026 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు అవార్డులు అందజేశారు. తేజ సజ్జా ఉత్తమ నటుడిగా, ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌)గా అవార్డులు అందుకున్నారు. దక్షిణాది సినీ దిగ్గజాలు, తారలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.