రైతు బజారు నిర్మాణానికి అదనపు నిధులు కోరిన విజయ్ బాబు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
పుత్తూరు పట్టణంలో రైతు బజార్ నిర్మాణానికి ప్రస్తుతం విడుదల చేసిన ఇరవై మూడు లక్షలకు అదనంగా మరో ఇరవై ఏడు లక్షలు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్ బాబు శుక్రవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కోరారు. ఈ మేరకు విజయవాడలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఇచ్చిన అభ్యర్ధన మేరకు పుత్తూరులో రైతు బజారు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.