పీహెచ్డీ కాలపరిమితిపై స్పష్టతనిచ్చిన యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీష్ కుమార్

రిపోర్టర్: నరేష్ స్థలం: నల్గొండ

పీహెచ్డీ కాలపరిమితిని కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనవసరంగా కుదించడం లేదా పొడగించడం సరికాదని యూజీసీ ఛైర్మన్, విద్యారంగ నిపుణులు ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. పరిశోధనను సకాలంలో పూర్తి చేయడంపైనే ప్రతి ఒక్కరూ ప్రధానంగా దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే పీహెచ్డీని పూర్తి చేయడం వల్ల ఎప్పుడూ అత్యుత్తమ పరిశోధనా ప్రమాణాలు సాధ్యం కావని ఆయన తేల్చిచెప్పారు.