ఎడిసన్ కమ్యూనిటీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: United States

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో సెంటర్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 4వ వార్షిక గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఎడిసన్ మేయర్ సామ్ జోషి ప్రత్యేక అతిథిగా హాజరై గణనాథుడిని దర్శించుకున్నారు. భారతీయ పల్లెటూరి సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన విలేజ్ థీమ్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరు రోజుల పాటు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సెప్టెంబర్ 19న నిమజ్జనంతో ఉత్సవాలు ముగియనున్నాయి.