ఎయిర్ ఇండియా పైలట్లకు వంద శాతం డ్రగ్ టెస్టులు తప్పనిసరి

రిపోర్టర్: గోపి స్థలం: India

ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం, పైలట్ డ్రగ్ పరీక్షల్లో విఫలమైన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ పైలట్లందరికీ వంద శాతం స్వచ్ఛంద డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. భద్రత విషయంలో జీరో టాలరెన్స్ పాటిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. విచారణకు పూర్తి సహకారం అందిస్తామని యాజమాన్యం వెల్లడించింది.