తండ్రి ఇంటిపేరును అధికారికంగా తొలగించిన ఏంజెలీనా జోలీ పెద్ద కుమారుడు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ ల పెద్ద కుమారుడు మడాక్స్ తన పేరులోని 'పిట్' ఇంటిపేరును అధికారికంగా తొలగించారు. లాస్ ఏంజిల్స్ కోర్టు ఇందుకు సంబంధించిన అభ్యర్థనకు ఆమోదం తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల మడాక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే జోలీ ఇతర పిల్లలు కూడా తండ్రి పేరును వదులుకునేందుకు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.