తెర్లాం మండలంలో కుంగిన వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే బేబీనాయన

రిపోర్టర్: GANESH BBL స్థలం: తెర్లాం

విజయనగరం జిల్లా తెర్లాం మండలం పణుకువలస గ్రామం వద్ద కుంగిపోయిన వంతెనను సోమవారం బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీనాయన) ఆర్&బి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న కారణంగా డైవర్షన్ రోడ్డును సత్వరమే నిర్మించాలని అధికారులను సూచించారు. నూతన వంతెన నిర్మాణానికి రూ.2.8 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు.