షాకింగ్ ఘటన: ప్రేమ పేరుతో నమ్మించి మూడో పెళ్లి చేసుకుని మోసం
రిపోర్టర్: నరేష్
స్థలం: నందిగామ
ప్రేమ పేరుతో నమ్మించి మూడో పెళ్లి చేసుకుని మోసం చేశాడని సోమేశ్వరి దేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన షేక్ మహబూబ్ సుభాని తనకు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి భార్యను హత్య చేసిన నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.