భర్త ఫోన్ ఎత్తలేదని వివాహిత ఆత్మహత్య
రిపోర్టర్: మహేష్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. భర్త ఫోన్ కాల్ ఎత్తలేదనే చిన్న కారణంతో మనస్తాపానికి గురైన అఖిల అనే యువ వివాహిత క్షణికావేశంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన అఖిలకు రెండేళ్ల క్రితం వివాహం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.